ప్రకృతిలో ఎటువంటి పొరపాట్లు ఉండవు

1973, డిసెంబర్ 3వ తేదీన అమెరికా లాస్ ఏంజెల్స్ నగరములోని వెనీస్ బీచ్ నందు ప్రాతఃకాల పాదాచార సమయమున శ్రీ ల ప్రభుపాదుల వారు, శిష్యుడైన డాక్టర్. భౌడం దామోదర్ సింగ్ మరియు కొందరు అతిథుల మధ్య జరిగిన సంభాషణ సంగ్రహణం


డాక్టర్ సింగ్: ఈ మధ్య శాస్త్రజ్ఞులు 'జెరెంటాలజీ' అనే ఒక శాఖను ఏర్పరచారు. ఇందులో జీవం ఆయుస్సును ఎలా పెంచవచ్చనే అంశంపై వారు పరిశోధిస్తున్నారు. 


శ్రీ ల ప్రభుపాద: వారి నిజమైన ఆశయం బాధలను ఎలా నివారించగలమనే దానిపై వుండాలి. ఉదాహరణకు ఒక వృద్దుడు వివిధ జబ్బులతో తీవ్రంగా బాధపడుతున్నాడనుకోండి, వైద్యులు అతని ఆయుస్సును ఉన్నట్టుండి పెంచితే ఏమైనా ఉపయోగముంటుందా? డాక్టర్ సింగ్: గుండె మార్పిడి శస్త్రచికిత్సలతో వారు చేస్తున్నదదే. శ్రీ ల ప్రభుపాద: అది అర్థరాహిత్యం! శ్రీ మరణాన్ని నిర్మూలించనీ. అదో గొప్ప విజయం. వ్యాధులన్నిటినీ నిర్మూలించనీ. అదీ ఓ గొప్ప విజయం. కాని ఇవేవీ వారు చేయలేరు. వారి పరిశోధనంతా కేవలం జీవించడం కోసం చేస్తున్న పోరాటమే. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, “భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశలే. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు” అని తెలియజేశారు. [భ.గీ. 15.7] విద్యార్థి: ఇంధనం కొరత కూడా రానురానూ తీవ్రమవుతోంది. శ్రీ ల ప్రభుపాద: అవును. ఇంధనంపై ఆధారపడే నాగరికతను మనం ఏర్పర్చుకున్నాము.ఇది ప్రకృతినియమాలకు విరుద్ధం గనుకనే ఇవాళ ఇంధన కొరత ఏర్పడింది. ప్రకృతి నియమాలనుసారంగా ఇప్పుడు శీతాకాలం రాబోతోంది. శాస్త్రజ్ఞులు దీన్ని ఆపి ఎండాకాలంగా మార్చగలరా? భ ప్రకృతిని శాసించగలమని వారు తప్పుగా భావిస్తున్నారు. ప్రకృతిచే నిర్వహింపబడు కర్మలకు కూడా తానే కరనని మొహపరవశుడైన జీవాత్మ భావించునని శ్రీ కృష్ణుడు భగ తెలిపాడు. ఇప్పుడు సూర్యోదయం అవుతోంది. వారు దీన్ని రాత్రిగా మార్చగలరా? రాత్రివేళ సూర్యుడిని ఉదయించమని ఆదేశించగలరా? నిజంగా వారు ప్రకృతిని జయించదలచుకుంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధులను జయించాలి. “త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చినవారు దీనిని సులభముగా దాటగలుగులుగుదురు” అని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. 14] డాక్టర్ సింగ్: అయితే, ప్రకృతి నియమాలను అధిగమించడం చాలా కష్టతరమా? శ్రీ ల ప్రభుపాద: బద్దజీవులకు అసాధ్యం. కాశీ కృష్ణుని శరణుపొందినవారికి చాలా సులభం. | డాక్టర్ సింగ్: ప్రపంచంలో ఇన్ని రకాల జీవరాశులు ఎలా ఆవిర్భవించాయో వివరించేందుకు శాస్త్రజ్ఞులు చెప్పేదేమిటంటే, ముద్రణాలయంలో ఒక ముద్ర నుండి మరో ప్రతిని ముద్రిస్తున్న సమయంలో అప్పుడప్పుడూ జరిగే తప్పిదముల లాగానే, జీవకణాలు ప్రత్యుత్పత్తి చెందుతూ జీవం పరిణామం చెందే క్రమంలో కూడా కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతుంటాయి. ఇటువంటి తప్పిదాల వల్ల జీవకణాల్లో ఏర్పడిన మార్పుల ప్రభావమే వివిధ జీవరాశులు ఏర్పడేందుకు కారణమని వారంటారు. శ్రీ ల ప్రభుపాద: కాని, వివిధ రకాల జీవరాశులన్నీ సృష్టిలో ఎప్పుడూ వున్నాయి. అంటే ఆ 'తప్పిదము' అనాదికాలం నుండి కొనసాగుతూనే ఉందన్నమాట! సనాతనంగా జరుగుతున్న ఒక ప్రక్రియను 'తప్పిదము' అని ఎలా అనగలరు? 'వివేకము' అని అనటం సరైనది. డాక్టర్ సింగ్: కాని కణాలు పరివర్తనం చెందని క్రమంలో విశ్వమంతా ఒకే ఓక రకమైన జీవరాశి ఉంటుందని శాస్త్రజ్ఞులంటున్నారు. శ్రీ ల ప్రభుపాద: ప్రతి విభిన్నమైన మనస్తత్వముంటుంది. ఆ వివిధ మనస్తత్వాలకు సరిపోయే విధంగా వివిధ జీవరాశులు ఏర్పడ్డాయి. ఉదాహరణకు, మనమందరం ఇక్కడ నడుస్తున్నాము. కాని, చాలా మంది మనతో కలిసి జీవించేందుకు ముందుకు రావట్లేదు. అంటే వారి స్వభావం మన స్వభావానికన్నా భిన్నమైనది. ఈ వ్యత్యాసాలు ఎందుకున్నాయి? డాక్టర్ సింగ్: బహుశా ఏదైనా తప్పిదము జరిగుండొచ్చు. తప్పిదము జరిగుండొచ్చు. శ్రీ ల ప్రభుపాద: అది తప్పిదము కాదు. అది వారు కోరుకున్నది.మరణ సమయంలో ప్రతిఒక్కరికీ తమ కోరిక ప్రకారమే మరొక శరీరం లభిస్తుంది. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు: “దేహమును త్యజించునపుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.” భ.గీ. 18.61]. మరణించేటప్పుడు దేనినైతే మనం స్మరిస్తామో, అదే మన తదుపరి శరీరాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతి అందుకు తగిన శరీరాన్ని మనకందిస్తుంది. అది మన చేతిలోలేదు. ప్రకృతి భగవంతుని ఆదేశాలనుసారం నడుస్తుంటుంది. డాక్టర్ సింగ్: కాని, పొరపాట్ల కారణంచేతనే ఆధారాలుండవచ్చు. శ్రీ ల ప్రభుపాద: అదే వారు చేస్తున్న పొరపాటు! ప్రకృతిలో ఎటువంటి పొరపాట్లు లేవు. రైల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ తరగతి కంపార్ట్మెంట్లుంటాయి. మూడవ తరగతి టికెట్టు కొని, మొదటి తరగతి కంపార్ట్మెంటులో ఎక్కితే ఎక్కువసేపు నిన్ను అక్కడే వుంచరు. వివిధ రకాల తరగతులుండటం తప్పుకాదు. అది ప్రకృతి సహజం. కాని నీకు కేటాయించిన తరగతిలోనికి గాక మరో తరగతికి వెళ్ళడం నీ తప్పు. మనం చేసే తప్పులన్నీ తెలిసినవాడు భగవంతుడు. అందువల్లనే, నీవు చేసిన తప్పుల ఆధారంగా అందుకు తగిన శరీరాన్ని నీవు పొందుతావు. సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. వీటిలో ఏ మాత్రం లెక్క తప్పకుండ కచ్చితమైన శరీరాన్నే ప్రకృతి ప్రసాదిస్తుంది. ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు, అంతకన్నా ముందే జైళ్లను కూడా నిర్మిస్తుంది. ఎందుకంటే, జైళ్లకు వెళ్ళవలసిన నేరస్తులు కూడా చాలామంది ఉంటారని ప్రభుత్వానికి తెలుసుకాబట్టి. అది ప్రభుత్వం పొరపాటు కాదు. నేరస్తులది. నేరము చేశారు కాబట్టి జైలుకు వెళ్ళవలసిందే. ప్రకృతిలో అటువంటి పొరపాట్లుండవు. “ఓ కౌంతేయా! నా శక్తులలో ఒకటైన భౌతికప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది" అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలియజేశాడు. భ.గీ. 9.10]. భగవంతుని ఆజ్ఞానుసారం నడిచే ప్రకృతిలో పొరపాట్లు ఎలా సంభవించగలవు? కాని మనం పొరపాట్లు చేస్తాం, మొహానికి గురవుతున్నాము, మన ఇంద్రియాలు అసంపూర్ణం, మోసపూరితమైన భావాన్ని కలిగున్నవారము. భగవంతునికీ మనిషికీ అదే వ్యత్యాసం. భగవంతుడు సంపూర్ణమైన ఇంద్రియములు కలవాడు.


డాక్టర్. వోల్ఫ్-రాట్టే: మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి కాబట్టే, వాటిచే సృష్టించబడ్డ మైక్రోస్కోపులు, టెలిస్కోపులు కూడా అసంపూర్ణమే అయివుంటాయి.


శ్రీ ల ప్రభుపాద: అవును. | లౌకిక ప్రపంచమే లోపభూయిష్టమైనది. అటువంటి లోపాలతో కూడిన జ్ఞానం మరియు అసంపూర్ణమైన ఇంద్రియాలతో నిర్మించే ప్రతీఒక్కటీ లోపాలతోనే నిండివుంటుంది. అందుకే శాస్త్రజ్ఞులు చెబుతున్నది కూడా లోపాలతో కూడినదని నిర్ధారించవచ్చు.


డాక్టర్ సింగ్: కాని వారు కనుగొన్నదానితో వారు సంతృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది.


ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రీ ల ప్రభుపాద: ఒక చాకలివాని గాడిద కూడా బరువును మోస్తూ సంతృప్తిగానే వుంటుంది. భారతదేశంలో కొన్నిచోట్ల తిండిదొరక్క కుక్కలు మరణించటాన్ని చూస్తుంటాము. అటువంటి కుక్కకూడా ఒక ఆడ శునకం కనిపిస్తే దానితో ప్రత్యుత్పత్తి జరిపి తృప్తి పొందాలనుకుంటుంది. అదా నిజమైన సంతృప్తి? అకాలితో ఒకప్రక్క అలమటిస్తున్నా ప్రత్యుత్పత్తితో సంతృప్తి పొందుతోంది. అలాగే మలంలోని కీటకాలు కూడా సంతృప్తిగానే ఉంటున్నాయి. అది ప్రకృతి ధర్మం. శ్రీ వివిధ జీవరాశులు ఉద్భవించాయని శాస్త్రజ్ఞుల వద్ద తగిన ఆధారాలుండవచ్చు.